మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలి
వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణులు ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి మాతా శిశు మరణాల (మెటర్నిటీ చైల్డ్ డెత్)పై అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే గర్భిణులు ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తమ పరిధిలోని గర్భవతులను అనుసంధానం చేసుకొని తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ,
వారి ఆరోగ్య పరిస్థితి మేరకు చర్యలు తీసుకోవాలని,జిల్లాలో ఇప్పటివరకు నాలుగు మాతృ మరణాలు,మూడు శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులు,ఏఎన్ఎం లతో కలెక్టర్ సమీక్షిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాలని,సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగే సమయంలో తలెత్తే లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని,ఆస్పత్రులలో పరికరాల కొరత ఉన్నట్లయితే ఆరోగ్యశ్రీ లేదా ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుండి ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని,నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ కు సంబంధించి ఓల్డ్ బ్లడ్, ప్యాకెడ్ సెల్స్,ఎస్ఎఫ్ పి రక్త బ్యాగులను ఇచ్చే విధంగా నివేదికలు సిద్ధం చేసి పంపాలని,ప్రతి ఆసుపత్రిలో సీటీజి మిషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి గర్భిణీ స్త్రీలను108 వాహనంలో పంపేటప్పుడు సంబంధిత ఏఎన్ఎం,ఆశ వర్కర్ వెంటవెళ్లి సంబంధిత ఆసుపత్రిలో అప్పజెప్పెలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డా.వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల పాల్గొన్నారు.
Home
Unlabelled
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలి... వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: