కేసికెనాల్ కు నీటిని విడుదల చేయకపోతే ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం
సీపీఐ నాయకులు హెచ్చరిక
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1.65 వేల ఎకరాలకు జిల్లా రైతున్నల పంటలు పండించుకోవడానికి అండగా ఉన్న కేసికెనాల్ కు జూన్ మాసం లో రావలసిన సాగునీరు అధికారులు, జిల్లా ఎమ్మెల్యే ల,పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగస్టు పూర్తవుతున్నా సాగునీరు రాకపోవడం సిగ్గుచేటని,పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తుతున్న పాలకులు కెసికెనాల్ కు నీళ్లు విడుదల చేయాలని ఆలోచన చేయడం లేదని, ఓట్లు వేసిన ప్రజలకంటే బయట ప్రాంత అభివృద్ధి ముఖ్యమా అని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు,సహాయ కార్యదర్శి బాబా ఫకృదిన్ ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాల జిల్లా కేసి కెనాల్ ఎగ్జక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఈఈ తిరుమలేశ్వరెడ్డి కి సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసిన నంద్యాల జిల్లా రైతులను పాలకులు విస్మరిస్తున్నారని,పంట పొలాలకు నీరందించలేని పరిస్థితిలో ఉన్నారని,కేసి రైతుల పొలాలు బీడు భూములుగా మారుతున్న అధికార యంత్రాంగానికి కనిపించడం లేదా అని జిల్లా ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.11-08-23 వ తేదీన పోతిరెడ్డిపాడు దగ్గర హంగామా చేస్తూ నంద్యాల జిల్లాలో ఉన్న ఏమ్మెల్యేలు,
ఎంపీలు క్రిందకు నీరు వదిలారు తప్ప,ఓట్లేసి గెలిపించిన జిల్లా కేసి కెనాల్ రైతుల పరిస్థితి ఆలోచించలేదన్నారు.సమయానికి సాగునీరు వదలకుంటే కేసి క్రింద సాగుచేసే వరి రైతులు పొలాలు బీడు భూములుగా మారుతు న్నాయని,చేతకాక పొతే క్రాఫ్ హాలీడే ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అధికారులు చెప్పినట్లుగా అరుతడి విత్తనాలు వేసుకున్న రైతులు మొలవక పంటలు చెడగొట్టే పరిస్థితి ఉందన్నారు.ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని, ముచ్చుమర్రి దగ్గర ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Home
Unlabelled
కేసికెనాల్ కు నీటిని విడుదల చేయకపోతే ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం....... సీపీఐ నాయకులు హెచ్చరిక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: