ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలనలో బిఎల్ఏ లను భాగస్వామ్యం చేయండి
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో ఈ నెల 21వ తేదీ వరకు ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన జరుగుతుందని, వాటిలో బిఎల్ఏ లను భాగస్వామ్యం చేసి తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు.కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 వ తేదీ వరకు బిఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను భాగస్వామ్యం చేసి, ప్రతి కుటుంబంలోని కుటుంబసభ్యుల ఓట్లు వేరువేరు పోలింగ్ స్టేషన్లో ఉండకుండా ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని బిఎల్ఓ లకు ఆదేశాలు జారీ చేయాలని ఈఆర్వోలను ఆదేశించారు.
డూప్లికేట్ ఓటర్లను సుమోటోగా కాకుండా ఫామ్ 7 ద్వారా తొలగించాలని,డూప్లికేట్ ఓటర్లు,చనిపోయిన ఓటర్లపై సంబంధిత ఈఆర్వోలు సర్టిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుందని,ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైందని ఏమాత్రం లోపాలున్న సంబంధిత ఈఆర్ఓ లపై చర్యలు ఉంటాయని, పెండింగ్లో ఉన్న ఇంటింటి సర్వేను నిర్ణీత కాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను ఆదేశించారు,నందికొట్కూర్,శ్రీశైలం,ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో ఉన్న చెంచుగూడెంలలో దాదాపు 2000 మంది గిరిజన ఓటర్లు నమోదు కావాల్సి ఉందని,ఈ అంశంపై సంబంధిత వీఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించి ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు సంబంధిత ధృవపత్రాన్ని ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య,జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈఆర్వో,ఏఈఆర్వోలు, బిజెపి నాయకులు గంగాధర్,సిపిఐ పార్టీ నాయకులు రంగనాయుడు,సిపిఐఎం నాయకులు రమేష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశంపార్టీ నాయకులు నరేంద్ర కుమార్,వైయస్సార్ సిపి పార్టీ నాయకులు అనిల్ అమృతరాజ్,సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలనలో బిఎల్ఏ లను భాగస్వామ్యం చేయండి....... జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: