గంజాయి,  గుట్కా మత్తు పదార్థాలను అరికట్టాలి

ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్ బీ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న గంజాయి,గుట్కా,మత్తు పదార్థాలను అరికట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా  సహాయ కార్యదర్శి బత్తిని ప్రతాప్, వనం వెంకటాద్రి స్థానిక పాణ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాణ్యం మండలంలో గంజాయి, గుట్కా,తాంబాకు మత్తుకు విద్యార్థులు,యువత బానిసలుగా మారుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75% యువకులకు మత్తుపదార్థాలు చేరువ ఆవుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసు అధికారులదని, పాఠశాలలో,కళాశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా బానిసలు అవుతున్నారని,


మత్తు పదార్థాలు సేవిస్తున్న యువకులపై దృష్టి సారించి,మత్తు పదార్థాలు విద్యార్థులకు ఏ విధంగా లభిస్తున్నాయి అనే విషయాలను సేకరించి కట్టడి చేయాలని, విద్యార్థులకు కళాశాలలో, పాఠశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసి,పాణ్యం మండల కేంద్రంలో పాఠశాల వద్ద కళాశాల వద్ద ఉన్న షాప్లు,హోటల్ లను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులకు మత్తు పదార్థాలు అందజేస్తున్న షాప్ లను సీజ్ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యకర్తలు శ్రీకాంత్,నాగరాజు,విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: