200 వ రోజులకు చేరిన యువగళం...
సంఘీభావ ర్యాలీ నిర్వహించిన గౌరు వెంకట రెడ్డి దంపతులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలో వైసిపి పాలనపై సమరభేరి మోగిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద 200 వ రోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైసీపీ సర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇస్తూ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత నారా లోకేష్ కు మద్దతుగా నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో 200 రోజుల సంఘీభావ ర్యాలీని కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహం నుండి నంద్యాల చెక్ పోస్టు వరకు నందికొట్కూరు పాణ్యం నియోజకవర్గంలోని టిడిపి మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో కార్యకర్తలతో అభిమానులతో పాదయాత్ర నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని తెలిపారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో నందికొట్కూరు, పాణ్యంనియోజకవర్గాల్లోని టిడిపి మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు,అభిమానులు దాదాపు 200 మంది స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: