మెడికల్ విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నంబర్ 107,108 లను రద్దు చేయాలి

 ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు డిమాండ్


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో మెడికల్ సీట్ల కేటాయింపులో పేద విద్యార్థులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 107,108 లను రద్దు చేయాలనీ, మెడికల్ సీట్లలో 85% కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలనీ,మిగిలిన 15% సీట్లను క్రీడారంగానికి,NCC విద్యార్థులకు,పోలీస్ అమరవీరుల విద్యార్థులకు వర్తింపజేయాలనీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు  నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాలలో అమల్లోకి తీసుకువచ్చి ప్రారంభం చేస్తున్నటువంటి నేపథ్యంలో 85% రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వాలని, మిగిలిన15% క్రీడా రంగానికి,పోలీసు అమర వీరుల విద్యార్థులకు,


NCC రంగానికి కేటాయించాలని  వారు డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 107,108 జీవోలను తీసుకువచ్చి మెడికల్ సీట్ల విషయంలో 50% కన్వీనర్ కోటలో ఇచ్చి మిగతా 50% సీట్లను అమ్ముకోవడానికి కుట్ర చేస్తున్నదని,ఈ విధంగ చేయడం వల్ల బీసీ, ఎస్సి,ఎస్టీ,మైనార్టీ వర్గాల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని,డబ్బున్న వాడు సీట్లు కొనుక్కొని వైద్య విద్యను చదువుకోకుండా వైద్యరంగంలోకి వస్తారని, ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఏమాత్రం న్యాయం చేసినట్లు కాదని, డబ్బున్న వాడికే వైద్య విద్యను అంగట్లో సరుకుల అమ్మే పద్దతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారిస్తున్నదని,కేవలం ప్రభుత్వ కళాశాలలోనే ఈ విధంగా 50% సీట్లను కోట్ల రూపాయలకు అమ్మడం జరుగుతుందంటే ప్రైవేట్ కళాశాలలో ఇంకా ఎన్ని కోట్లకు మెడికల్ సీట్లను అమ్ముతున్నారో ఆలోచన చేయాలని,పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డాక్టర్లు అవసరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించి భవిష్యత్ తరాలకు వైద్యాన్ని అందించడం కోసం కావలసిన డాక్టర్లను తయారు చేయకుండా ప్రభుత్వ కళాశాలలోనే సీట్లును అమ్మితే వైద్యరంగంలోకి వచ్చే వైద్యులు డమ్మీ వైద్యం చేసే తప్పుడు డాక్టర్లకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెడికల్ సీట్ల విషయంలో 85% కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేసి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీవర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో అన్యాయానికి గురి అవుతున్న వైద్య విద్యార్థులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎర్రిస్వామి,సురేష్, నంద్యాల పట్టణ ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంకటహ నుమంత్,నరేష్ లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: