పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ బైరెడ్డి సిదార్థ్ రెడ్డి
తనను ఎవరూ పట్టించుకోవడంలేదన్న కారణంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ధ్వజమెత్తారు. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ ఆరోపణలను ఖండించారు. ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పవన్ వివాదాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు. రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అసలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఆయనకు ఓటేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీ పనైపోయిందని, అలాంటి పార్టీతో పొత్తులకు పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ బైరెడ్డి సిదార్థ్ రెడ్డి
Post A Comment:
0 comments: