ప్రజల సంక్షేమానికే..... జగనన్న సురక్ష
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ప్రజాలందరూ సంక్షేమ పథకాలు పొందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 11 రకాల పత్రాలు మంజూరు చేస్తున్నారని అధికారులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు.
గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి ఎర్రగుడి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించి అర్హులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి
నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందకుండా ఉంటే వాలంటీర్లును సంప్రదించి వారి ద్వారా వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందుకోవచ్చని, ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని పొందే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు ద్వారం శ్రీకాంత్ రెడ్డి,సిరూప శ్రీనివాస రెడ్డి, గడివేముల తహసిల్దార్ శ్రీనివాసులు ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప, పంచాయతీ సెక్రెటరీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రజల సంక్షేమానికే..... జగనన్న సురక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: