ఇసుక లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం,,,ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

 జనగామ జిల్లాలో ఇసుక లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం,,,ఇద్దరు వ్యక్తులు దుర్మరణం


జనగామ జిల్లాలో  హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవేపై రఘునాథపల్లి మండలం కోమల టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని బొలెరో వెహికల్ వెనుక నుంచి గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

బొలేరో వాహనం ‌వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులలో ఒకరిని హన్మకొండకు చెందిన వడ్లకొండ రాకేష్‌గా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉండగా.. అతడు కూడా సాఫ్ట్‌వేరే ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రఘునాథపల్లి ఎస్సై రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ప్రమాదంపై మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: