రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి....

సిపిఎం నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలయ్యి 2 నెలలు అవుతున్న రుతుపవనాలు ఆశాజనకంగా లేవని నైరుతి రుతుపవనాలు వెనుకంజ వేయడంతో రైతులు పత్తి,మొక్కజొన్న, మిరప,కంది తదితర పంటలు వేశారని,వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదని, నందికొట్కూరు,మిడుతూరు,జూపాడుబంగ్లా మండలాల్లో నేటి వరకు వర్షపాతం లేదని,రైతులు విత్తనాలు వేసి నష్టపోవడం జరిగిందని,తక్షణమే ఖరీఫ్ రైతులను ప్రభుత్వం ఆదుకోని నష్టపరిహారం అందజేయాలని, నందికొట్కూరు నియోజకవర్గం లో చుట్టూ నీళ్లు ఉన్న తాగే పరిస్థితి లేదని, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇరువైపులా కేసీ కెనాల్, తెలుగుగంగ,ఎస్ఆర్బిసి హంద్రీనీవా,అలగనూరు రిజర్వాయర్ లిఫ్ట్ఇరిగేషన్లు ఉన్న రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేదని,ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడడం వలన ప్రాజెక్టులను నీరు వస్తున్న సముద్రంలో కలవడం తప్ప ఈ ప్రాంత రైతులకు ఆ నీరు అందే పరిస్థితి లేదని,శ్రీశైలం జలాశయం నుండి రాయలసీమకు నీరందే పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రైతుల పైన ఏమాత్రం కూడా ప్రేమ లేదని, రైతులు 2021-22 సంవత్సరంలో ఖరీఫ్,రబీ సీజన్లో పంటలు సాగు చేశారని,ప్రభుత్వం 08-07-23 వ తేదీన పంటల బీమా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని,దాదాపు ఈ నియోజకవర్గంలోని రైతులు విస్తారంగా గత సంవత్సరం పత్తి, మొక్కజొన్న,మిరప,ఉల్లి తదితర పంటలు సాగుచేసి అతివృష్టి,అనావృష్టి వల్ల నష్టపోయారని జూపాడు బంగ్లా,మిడుతూరు మండలంలో గత సంవత్సరంలో వేసిన పత్తి పంట నందికొట్కూరు, జూపాడుబంగ్లా,పగిడాల మండలాల లోని గ్రామాలను శాస్త్రవేత్తలు పరిశీలించి నకిలీ విత్తనాల వల్ల రైతులు పూర్తిగా పంట నష్టపోయారని,అలాంటి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వాతావరణ బీమాను పరిగణలోకి తీసుకొని రైన్ ఫాల్స్ వల్ల వర్షం ఎక్కువగా పడిందని మెట్ట రైతులకు, కవులు రైతులకు

నష్టపరిహరం ఇవ్వకపోవడంతో మెట్ట రైతులు పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని,తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని  రైతులను ఆదుకోవాలని, మండలాలలో ఆర్బికే సెంటర్లు కేవలం శిలాఫలకలగా ఉన్నాయని, ఏ ఒక్క ఆర్బికే సెంటర్లలో కూడా రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు లేవని,మాట తప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి మాట ఆర్బికే సెంటర్లలో విత్తనం నుండి ధాన్యం కొనుగోలు కొరకు రైతు భరోసా కొనుగోలు కేంద్రాలు చూసుకుంటాయని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని,హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని, తక్షణమే రైతన్నల సమస్యలను పరిష్కరించకపోతే నియోజకవర్గం లోని రైతాంగాన్ని కదిలించి రైతాంగ సమస్యల పైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కర్ణ, నరసింహులు,నాయకులు రంగమ్మ,నవ్య,రాణమ్మ రాము,ఏసన్న,శివలింగన్న, నాగన్నలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: