ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 151వ రోజు యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మత్స్యకార గ్రామాల్లో యువనేత లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించించి. కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె వద్ద చిప్పలేరు బ్రిడ్జిపై యువనేతకు అక్కడి ప్రజలు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. ఈ గ్రామంలోని మత్స్యకారులు లోకేష్ కు స్వాగతం పలుకుతూ బోట్లపై యువగళం జెండాలను ప్రదర్శించారు.
అంతకుముందు జువ్వలదిన్నెలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనాన్ని లోకేశ్ సందర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి ముచ్చటించారు. చిప్పలేరు వంతెన వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఇది మద్రాసు-కలకత్తా రహదారి నుంచి కావలి నియోజకవర్గం ఎస్వీ పాలెం మీదుగా జువ్వలదిన్నె వెళ్లే రహదారిలో చిప్పలేరు వాగుపై నిర్మించిన వంతెన. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.25.30 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 11-1-2019న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అందినకాడికి దోచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ" అంటూ చురకలంటించారు.
Home
Unlabelled
ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: