గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు,,,,

ఒక కోటి రూపాయల నిధులు మంజూరు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ లు, గ్రామ ప్రజలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం, కందుకూరు మండలాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఒక కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఈ నిధులు విడుదల అయ్యాయి. మహేశ్వరం మండల పరిధిలోని డబిల్ గూడ,పెద్దమ్మ తండా, హాబీబుల్లాగూడ, మహబ్బాత్ నగర్, కందుకూరు మండలం సర్లరావులపల్లి గ్రామాలకు 20 లక్షల చొప్పున గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల అయ్యాయి. కోటి రూపాయల నిధులతో ఆయా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేసి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: