ఏపీలోె వర్షాలు...ఈ జిల్లాల్లో కురిసే అవకాశం
ఏపీలో నేడు పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఏపీలో ఇప్పటికే వర్షాలు పడుతుండగా.. రానున్న నాలుగు రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. నేటి నుంచి 19వ తేదీ వరకు వానలు కురవనున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిలాల్లో స్వల్ప వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇక 17వ తేదీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో జల్లులు పడనున్నాయి. అలాగే 18వ తేదీ కూడా అవే జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇక 19వ తేదీ కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తు నిర్వాహణ సంస్థ అంచనా వేసింది.
అటు నిన్న కాకినాడలో 6.8 మిల్లీమీటర్లు, తునిలో 0.8 మి.మీ, గన్నవరంలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్లలో గరిష్టం 36.8, కనిష్టం 25.7, కాకినాడలో గరిష్టం 35.6, కనిష్టం 26.5, కళింగపట్నంలో గరిష్టం 33.4, కనిష్టం 27.7 డిగ్రీల సెల్సియస్, మచిలీపట్నంలో గరిష్టం 35.8, కనిష్టం 27.8, నందిగామలో గరిష్టం 35.3, కనిష్టం 28.5, నర్సాపూర్‌లో గరిష్టం 36.1, కనిష్టం 29.1, నెల్లూరులో గరిష్టం 37.6, కనిష్టం 29.2, ఒంగోలులో గరిష్టం 37.5, కనిష్టం 28.3, విశాఖపట్నంలో గరిష్టం 34.4, కనిష్టం 29.2 డిగ్రీలు నమోదైంది.
ఏపీలోె వర్షాలు...ఈ జిల్లాల్లో కురిసే అవకాశం
Post A Comment:
0 comments: