సబితమ్మ ప్రత్యేక  విజన్ పాలనలో ,,,,

విద్యా హబ్ గా మహేశ్వరం నియోజకవర్గం

కేజీ టూ పీజీ, సాంకేతిక, వైద్య కళాశాలల నిలయంగా మహేశ్వరం నియోజకవర్గం

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఓ ప్రత్యేక విజన్ తో ముందుకెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంపై  ప్రత్యేక శ్రద్ద తీసుకొంటారు. దీంతో అనతికాలంలోనే మహేశ్వరం నియోజకవర్గం ఓ విద్యా హబ్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేజీ  టూ పీజీ విద్యను మహేశ్వరం నియోజకవర్గంలో తీసుకురావడమే కాకుండా సంకేతిక విద్యతోపాటు వైద్య విద్యను మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ముంగిట తీసుకొచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.


దీంతో నియోజకవర్గ ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాలన పట్ల  హర్షం వ్యక్తంచేస్తున్నారు. మహేశ్వరం మండలం కెసి తండా  గ్రామ పరిధిలో 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కేసీ తాండ వద్ద 1 కోటి 29 లక్షలతో నూతనంగా నిర్మించిన  మోడల్  స్కూల్ బాలికల హాస్టల్ భవనాన్ని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శిరీష తో మంత్రి  ప్రారంభింపజేసారు. కేసీ తాండ వద్ద మోడల్ స్కూల్ లో నూతనంగా మంజూరైన మహేశ్వరం పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి ప్రారంభించారు.

  ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ...ఒక్క జూనియర్ కళాశాల, ఒక్క డిగ్రీ కళాశాల,ఒక్కటైన పాలిటెక్నిక్ కళాశాలలు కావాలని  గతంలోఆడిగేవారని,  నేడు బడoగ్ పేట్ లో ఒక  పాలిటెక్నిక్ కళాశాల, మహేశ్వరం లో 24 కోట్లతో రెండోది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


దాంతో పాటు డైట్ కళాశాల,కస్తూరిబా పాఠశాల,  జిల్లా పరిషత్ పాఠశాల కేసీ తండా ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలో16 డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరు కాగా రంగారెడ్డి 2 రాగా అందులో ఒకటి బాలికల కళాశాల షాద్ నగర్ కు,కందుకూరు లో బాలురు బీసీ డిగ్రీ కళశాల మంజూరు అయిందన్నారు. దాంతో మూడు డిగ్రీ కళాశాలలు మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు అయినట్లు తెలిపారు. రెండు జూనియర్ కళశాలలు కూడా మంజూరు అయ్యాయన్నారు. 

 నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి  నిధులు విరివిగా ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  యూనివర్సిటీ కూడా రాబోతుందన్నారు.  మెడికల్ కళశాలకు కూడా ముఖ్యమంత్రి మంజూరు చేసారన్నారు. మోడల్ స్కూల్ లు మోడీ ప్రధాని అయ్యాక  రద్దు చేసారని, దాంతో వాటిని రాష్ట్ర ప్రభుత్వమే 400 కోట్ల భారం పడుతున్న నడిపిస్తుందన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలుగా కార్పొరేట్ కన్నా మేటిగా మన ప్రభుత్వ బడులు మారుతున్నాయన్నారు.


ఒక్క లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగాలని  డాక్టర్లు,ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థినిల విద్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారన్నారు.  కళ్యాణాలక్మి పథకం 18 ఏళ్ళు నిండిన వారికే ఇస్తున్నందున బాల్య వివాహాలు ఆగిపొగ ఉన్నత విద్యలో బాలికల శాతం పెరిగిందన్నారు.  ఉస్మానియా యూనివర్సిటీ లో 70 శాతం అమ్మాయిలు చదువుంతుండగా,  కాకతీయ విశ్వ విద్యాలయంలో 80 శాతం ఉన్నారన్నారు.  అందువల్లనే 100 కోట్లతో మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేసారన్నారు.


విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు,  టెక్ట్స్ బుక్స్ పుస్తకాలు, రాగి జావా,  ఉపాద్యాయులకు ట్యాబ్ లు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు 136 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, 190 కోట్లతో  ఉచితంగా టెక్స్ట్ బుక్స్, సంవత్సరానికి  35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇస్తునట్లు తెలిపారు.  12 లక్షల మంది విద్యార్థులకు 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్ , 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 20000  వేల మంది టీచర్స్ కు  అందించినట్లు తెలిపారు. మనఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 9123 పాఠశాలలో  3497.62 కోట్లతో పనులు చేపట్టి ఇటీవలే దాదాపు 1000 పాఠశాలలను ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నామన్నారు.


పెద్ద ఎత్తున విద్యా రంగానికి నిధులు కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి  ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 6 కోట్లతో  టెక్స్ట్ బుక్స్,10 కోట్ల 50 లక్షలతో 1.65లక్షల మంది  రెండు జతల యూనిఫామ్ లు, 5 కోట్ల విలువ చేసే 72 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్,18.15 లక్షలతో రాగి జావా 1.6 కోట్ల విలువ చేసే 1058 ఉపాద్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేసారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. 1200 కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు.  1200 జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసినట్లు, 85 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి అందులో 55 అమ్మాయిల కోసమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు, డిజిటల్ తరగతి గదులు కూడా ప్రారంభించుకుంటున్నట్లు తెలిపారు.


ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలో ఎక్కడ చుసిన తెలంగాణ విద్యార్థులే కనిపిస్తారన్నారు. పేద,మధ్య తరగతి విద్యార్థుల విదేశీ కలను సాకారం చేసే దిశగా ఓవర్సీస్  స్కాలర్ షిప్ లు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్,  సొసైటీ చైర్మన్ పాండు, వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి , పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, సర్పంచ్ మోతిలాల్,  సాంకేతిక విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: