గడివేములలో లారీ.... ద్విచక్ర వాహనంను ఢీకొనడంతో......

వ్యక్తికి తీవ్ర గాయాలు.... కేసు నమోదు


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం లోని స్థానిక గడివేములలో 02.07.2023 వ తేదీ రాత్రి 08.50 గంటలకు గడివేముల గ్రామానికి చెందిన పిన్నాపురం పెద్దన్న (36) తన మోటర్ సైకిల్ మీద వెళుతుండగా గడివేములలోని సినిమా హాల్ వద్ద వెనుక నుండి KA 34C 0925 అను నెంబర్ గల లారీ డ్రైవర్ అతివేగంగా ఆజాగ్రత్తగా,హరన్ కొట్టకుండా లారీని నడుపుతూ వచ్చి మోటార్ సైకిల్ ను ఢీ కొట్టడంతో పిన్నాపురం పెద్దన్న ఎడమ కాలికి,చేతికి,నడుము వద్ద గాయాలు కాగా వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం  కర్నూలు వైద్యశాలకు తరలించారు.కర్నూలు వైద్యశాల నందు చికిత్స పొందుతూ పిన్నాపురం పెద్దన్న తెలిపిన వివరాల మేరకు గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: