కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి
భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్ట్) ధర్నా
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ముందు కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితియానంద రాయి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు రాతపూర్వకంగా చెప్పారని,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసిన నివేదిక ఇచ్చిందని,కడప ఉక్కు పరిశ్రమ స్థాపించడం సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని,రాష్ట్ర విభజన నేపథ్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం నేడు మాట మార్చడం పద్ధతి కాదని, బిజెపి రాష్ట్ర శాఖ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయలసీమకు ఉక్కుఫ్యాక్టరీ సాధిస్తామని చెప్పి ఏర్పాటు చేయకుండా రాయలసీమ నిరుద్యోగ యువత ఆశలను బిజెపి ప్రభుత్వం నాశనం చేసిందని,బిజెపి పార్టీకి మద్దతిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,ప్రతిపక్ష టిడిపి పార్టీ,జనసేన పార్టీలు ప్రశ్నించడంలో విఫలమయ్యాయని,2007లో బ్రాహ్మిని స్టీల్ పరిశ్రమకు ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారని,
2018 లో చంద్రబాబు నాయుడు రాయలసీమ స్టీల్ అథారిటీ కార్పొరేషన్ పేరుతో శంకుస్థాపన చేశారని,2019 లో హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకసారి,2023 లో జెఎస్డబ్ల్యు కంపెనీ పేరుతో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ప్రభుత్వానికి లాభదాయకం కానీ కడప ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కంపెనీలకు ఎలా లాభదాయకమవుతుందనివిభజన చట్టం ప్రకారము కడపలో ఉక్కు పరిశ్రమ, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం బీహెచ్ఈఎల్ టెక్స్టైల్ పార్కులు,కర్నూల్లో 400 కోట్లతో రైల్వే కోచ్ నిర్మాణ పరిశ్రమ,నంద్యాలలో డోన్ మైనింగ్ ఇన్స్టిట్యూషన్, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టులాంటి విభజన చట్టంలో ఉన్నా పది సంవత్సరాలు పూర్తయిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని కారణం కేంద్ర బిజెపి ప్రభుత్వం యొక్క విధానాలే కారణమని వెంటనే ప్రభుత్వ ఆధ్వరంలోనే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి గనులు కేటాయించి రాయలసీమ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం పార్టీగా కోరుతున్నామని లేని పక్షంలో ఉక్కుపరిశ్రమ సాధించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏసురత్నం,జిల్లా నాయకులు గౌస్, మస్తాన్వలి,రత్నమయ్య, శ్రీకాంత్, నాయకులు లక్ష్మణ్,రామచంద్రుడు,బాల వెంకట్,రామరాజు,నిరంజన్, భాస్కర్,మార్కు,సుబ్బారావు, కృష్ణా,హరి,సాయి తదితరులు పాల్గొన్నారు.
కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని.....
భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్ట్) ధర్నా
Post A Comment:
0 comments: