కోనాయిపల్లి వెంకటేశ్వరాలయంలో చోరీ,,,హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు

 కోనాయిపల్లి దేవాలయంలో చోరీ,,,హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు


కోనాయిపల్లి దేవాలయంలో చోరీ జరిగింది. సీఎం కేసీఆర్‌కు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. గతంలో ఏ ఎన్నికల్లో పోటీచేసినా ముందు నామినేషన్ పత్రాలు కోనాయిపల్లి ఆలయంలో ఉంచి పూజలు చేసిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కూడా సీఎం కేసీఆర్ మొదట ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆయన పలుమార్లు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు కూడా ఆ ఆలయం సెంటిమెంట్. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేసే ముందు నామినేషన్ పత్రాలకు ఇక్కడే పూజలు చేయిస్తారు. అటువంటి ఆలయంలో దొంగలు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు దొంగల కోసం వేట మెుదలు పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. సిద్దిపేట అర్బన్ మండలం పరిధిలోని వెల్కటూర్ గ్రామంలోని భద్రకాళి అమ్మవారు, పోచమ్మ ఆలయాల్లోనూ దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలో సుమారు రూ. 40 వేల నగదు, 8 తులాల వెండి చోరీకి గురైనట్లు ఆలయాల పూజారులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ మూడు ఆలయాల్లో చోరీలకు పాల్పడింది ఒక్కటే ముఠానా ? లేక వేర్వేరు ముఠాలకు చెందిన వారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: