తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో కల్చరల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ 34 వ డివిజన్ లెనిన్ నగర్ బ్రహ్మంగారి దేవాలయం వద్ద 10 లక్షలతో నిర్మించనున్న కల్చరల్ భవన నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి, నోటరీ ద్వారా స్థలాలు కొన్న వారికి 58,59 జీవోల ద్వారా హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
స్వంత జాగా ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం రూ. 3 లక్షలు అందిస్తుందని తెెలిపారు. అర్హులైన వారికి త్వరలో డబల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఎలాంటి సహాయం చేయనున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతొ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కళ్యాణాలక్మి, షాది ముబారక్, పెన్షన్లు 2 వేలు, వికలాంగులకు 4 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి మీర్ పేట్ కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు వస్తుంటేనే కొన్ని పార్టీల నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. బిఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల కలలు సాకారం చేస్తూ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు ,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,,,మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో కల్చరల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: