తెలంగాణ ఉద్యమంలో... రాష్ట్ర నిర్మాణంలో..
సాయి చంద్ పాత్ర ఎంతో కీలకం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమ గాయకులు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మృతి పట్ల రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశములో నివాళులు అర్పించారు. సాయి చంద్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో, రాష్టం సాధించిన తర్వాత బంగారు
తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ గాయకునిగా సాయి చంద్ క్రియాశీల పాత్ర పోషించారని, అందరిలో ఒక స్ఫూర్తిని నింపారని అన్నారు. చిన్న వయసులో ఆకస్మికంగా మృతి చెందటం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Post A Comment:
0 comments: