అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాత నగరంలోని చారిత్రాత్మక ప్రాశస్త్యమైన శ్రీశ్రీశ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం విశేష పూజలు జరిగాయి. అక్క మాదన్న ఆలయ కమిటీ అధ్యక్షులు రాందేవ్ అగర్వాల్ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి లక్ష పుష్పార్చనలు నిర్వహించారు. జైస్వాల్ సమాజ్ అధ్యక్షరాలు శ్రీమతి కుసుమకుమారి జైస్వాల్ అమ్మవారికి బోనాల ఉత్సవ అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వేలాదిమంది భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాందేవ్ అగర్వాల్ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో జైస్వాల్ సమాజ్ అధ్యక్షురాలు కుసుమకుమారి జేస్వాల్ ను సన్మానించారు.
Home
Unlabelled
అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: