శ్రీశైలం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో,,ఉపాధ్యాయులను నియమించాలి     

గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జవహర్ నాయక్

(జానో జాగో వెెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం లోని శ్రీశైలం ప్రభుత్వ ఆశ్రమం పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మకూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం ప్రభుత్వ ఆశ్రమం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 55 మంది విద్యార్థులు మరియు 6 నుంచి 8వ తరగతి వరకు  36 మంది విద్యార్థులు ఉన్నారని, 91 మంది విద్యార్థులకు కేవలం ఒక ఉపాధ్యాయురాలు,



ఒక సిఆర్టి ఉపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారని,ఒక్క ఉపాధ్యాయురాలు ప్రధానోపాధ్యాయురాలు బాధ్యతలు మరియు వార్డెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని,పాఠ్యాంశాల వారిగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని,విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు లేరని ప్రైవేటు పాఠశాలల బాట పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి శ్రీశైలం ప్రభుత్వ ఆశ్రమం పాఠశాలలో పాఠ్యాంశాల వారిగా ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: