పాతబస్తీ చిన్నా విజాల్లో ఘనంగా బోనాల పండుగ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)పాతబస్తీ చిన్నా విజాల్లో శనివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆనవాయితీ ప్రకారం పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలకు ఒకరోజు ముందుగానే.. చిన్నబజార్లో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు:: చేశారు. అమ్మవారికి భక్తి ప్రవత్తులతో మహిళలు బోనాలను సమర్పించారు. బ్యాండు, మేళతాలలో పోతరాజుల విన్యాసాలతో యువత చిందులు వేశారు. చిన్నా బజార్ గజ్జెల పాపామ్మదేవాలయ చైర్మన్ మాచర్ల ప్రవీణ్ కుమార్, పురానాపూల్ కార్పోరేటర్ నున్నం రాజ్మాహాన్, ప్రతినిధులు సునిల్, నర్సింగ్గారావు, కాలిదాస్, అభిషేక్ రాజ్ సెక్సేనా, కునాల్ దేవేందర్ సింగ్, చిన్నరాజు, సాయికుమార్,
శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కసరట్టా నుండి అమ్మవారికి ప్రత్యేక తొట్టెల ఊరేంగువుని నిర్వహించారు. వివిధ వేషాధారణలతో కనరట్టానుండి హుస్సేనీ ఆలం, మూసాబౌలి మీదుగా దేవలాయనికి చేరుకుంది. ఈసందర్భంగా రాజ్మాహాన్ మాట్లాడుతూ చిన్నాబజార్లో బోనాల ఉత్సవాలు మతసామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. రెండు వర్గాల ప్రజలు కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలని కోరారు.-
Home
Unlabelled
పాతబస్తీ చిన్నా విజాల్లో ఘనంగా బోనాల పండుగ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: