భార్యాభర్తల మధ్య ఘర్షణ....
భర్త మృతి... కేసు నమోదు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని కొర్రపోలురు గ్రామంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగగా భర్త మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే కొర్రపోలురు గ్రామానికి చెందిన చాకలి లోకేశ్వరుడు గత ఐదు సంవత్సరాల నుండి మద్యానికి బానిసై భార్య పిల్లలను వేధించేవాడని, కుటుంబ సభ్యులు,పెద్దలు ప్రవర్తన మార్చుకోవాలని మందలించిన అతనిలో మార్పు రాక అందరితో గొడవ పడుతూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య సుబ్బలక్ష్మమ్మ పై ఘర్షణకు దిగాడని
భార్య తప్పించుకొనే ప్రయత్నంలో లోకేశ్వరుడు అనుకోకుండా కాలు జారీ తలకు గడప రాయి తగిలి తీవ్ర రక్తస్రావమై లోకేశ్వరుడు మృతి చెందాడని తండ్రి చాకలి రాముడు తెలిపిన వివరాల మేరకు సంఘటన స్థలాన్ని సిఐ వెంకటేశ్వరరావు,ఎస్సై బిటి.వెంకటసుబ్బయ్య పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
Home
Unlabelled
భార్యాభర్తల మధ్య ఘర్షణ.... భర్త మృతి... కేసు నమోదు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: