టీఎస్ ఆర్టీసీ మరో అదిరిపోయే ఆఫర్,,,శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే రూట్ లో,,,ముగ్గురు ఆపై ప్రయాణిస్తే పది శాతం డిస్కౌంట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే రూట్ లో,,,ముగ్గురు ఆపై ప్రయాణిస్తే పది శాతం డిస్కౌంట్


తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. సరికొత్త ప్యాకేజీలు, టికెట్ ధరలపై డిస్కౌంట్‌లు, కొత్త సర్వీసులతో ప్రయాణికులకు ఆక్యూపెన్సీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్‌లు ఆఫర్ చేస్తోంది.

తాజాగా.. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కనీసం ముగ్గురు ప్రయాణికులు కలిసి ప్రయాణం చేస్తే టికెట్‌ చార్జీల్లో డిస్కాంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ముగ్గురు నుంచి ఎంతమంది ప్రయాణికులైనా.. సరే కలిసి ప్రయాణం చేసినప్పుడు మొత్తం చార్జీల్లో 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న వెల్లడించారు.

క్యాబ్‌లు, ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ రాయితీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులను సైతం ఆకట్టుకొనేందుకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ మార్గాల్లో ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందేందుకు ఆర్టీసీ ఇప్పటికే బస్సుల్లో వైఫై తదితర ప్రత్యేక సదుపాయాలను ప్రవేశపెట్టింది. వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.300 వరకు టికెట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ప్రయాణించే దూరం, ప్రయాణికుల సంఖ్యను బట్టి డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టే కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు మార్గాలలో మరిన్ని కొత్త బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టిందన్నారు. త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్న కొత్త ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సుల్లో 20 బస్సులను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నడపనున్నట్లు ఆర్‌ఎం వెంకన్న వెల్లడించారు.

ఈ నెల 17న (రేపు) అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. గానుగాపూర్‌తో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు పండరీపూర్‌, తుల్జాపూర్‌కు ఈ ప్రత్యేక లగ్జరీ బస్సును సంస్థ నడుపుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ MGBS నుంచి గానుగాపూర్‌కు బస్సు బయలుదేరుతుంది. 18న మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బస్సు తిరిగి రానుంది. గానుగాపూర్‌ ప్రత్యేక బస్సు టికెట్‌ ధరను రూ.2500గా  నిర్ణయించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: