హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ
75వ బోనాల వజ్రొత్సవల ఆహ్వాన పత్రిక విడుదల
విడుదల చేసిన కే.వీ.రమణాచారి
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ 75వ బోనాల వజ్రొత్సవల ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ కె.వి.రమణ చారి ఈ రోజు మసబ్ టాంక్ లోని ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంతో తనకు గత 30 ఎండ్లకి పైగా అనుభవం ఉందని బోనాల గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల పండుగకు ప్రత్యేక ఆకర్షణగా ఏనుగు అంబారీ పై అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, సలహాదారులు జి.రాజారత్నం, కార్యనిర్వహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, సభ్యులు జగ్మోహన్ కపూర్, జి.శ్రీనివాస్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: