2వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.....
సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నియోజకవర్గ మండలంలో టిడిపి శాసనసభ సభ్యురాలు గౌరు చరిత రెడ్డి గారి ఆదేశాల మేరకు గడివేముల మండలం అధ్యక్షులు దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టిడిపి నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు పై భరోసానిస్తూ సాగుతున్న టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమకాలీన రాజకీయాల్లో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తూ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా యువనేత నారా లోకేష్ పాదయాత్రకు శుభాకాంక్షలు మరియు సంఘీభావం వ్యక్తం చేస్తూ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ మండు వేసవిని సైతం లెక్కచేయక సామాన్యుల పక్షాన నిలబడి రాష్ట్ర భవిష్యత్తు కొరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండడం అత్యంత సాహాసోపేత నిర్ణయమని,
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యువగలం పాదయాత్రలో లక్షలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు, యువతీ,యువకులు భాగస్వాములు అవుతున్నారని,లోకేశ్ పాదయాత్రలో నియోజకవర్గాల ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో బయట పెడుతుండటంతో వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదని,యువగళం పాదయాత్ర ప్రజాబలమై,అవినీతి పాలన పై రుజువులతో సహా నిరూపిస్తూ ఉత్సాహంగా సాగుతొందన్నారు.ఈ రాష్ట్రానికి చంద్రబాబు పాలన మళ్లీ రావాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలని యువత సమరోత్సాహంతో కదం తొక్కుతోందని ఎటువంటి లాభాపేక్ష లేకుండా,సమాజంతో పాటు రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే యువత పాదయాత్రలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి స్వార్థ పూరిత నిర్ణయాలతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని,
రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, భవిష్యత్తుకు సమాధి కడుతున్న వైసీపీ పాలకులను తరిమి కొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని.వైసీపీ పాలకుల అనాలోచిత, దురహంకార నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని రాజకీయంగా వైసీపీని సమాధి చేయడానికి ప్రజలందరూ కంకణ బద్ధులయ్యారన్నారు. వైసీపీ నాయకులు ముఠాలుగా ఏర్పడి విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. వైసీపీ దోపిడీదారుల కబంధ హస్తాల నుండి మన రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి ప్రజానీకం ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడి పాలనను కోరుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల తెలుగుదేశం నాయకులు దుబ్బ శ్రీనివాస రెడ్డి,దేశం వెంకటేశ్వర రెడ్డి,దేశం వెంకటకృష్ణారెడ్డి,జమ్మి చెట్టు సంజీవరెడ్డి,దేశం రమణారెడ్డి,దుబ్బ రామచంద్రారెడ్డి,దుబ్బ రమణారెడ్డి,దాసి నాగిరెడ్డి, గఫూర్,సలాంభాష, అవ్వారు శ్రీకాంత్, అమర్నాథ్ రెడ్డి, నాగన్న,దాసి నాగిరెడ్డి, సుబ్బారెడ్డి మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.
Home
Unlabelled
2వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా..... సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: