ఆ క్షతగాత్రులకు ఆపద్బంధువు అయ్యారు

ప్రమాదానికి గురైన వారిని కాపాడిన బిజెపి నేత బుక్క వేణుగోపాల్

నేత అంటే ఇలా ఉండాలని బుక్క వేణుగోపాల్ కు వెల్లువెత్తుతున్న ప్రశంసలు

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులకు  బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆపద్బంధువుడయ్యారు. పలు శుభకార్యాలకు హాజరై బుక్క వేణుగోపాల్ తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో తొండుపల్లి వద్ద తన వాహనానికి 200 మీటర్ల దూరంలో ఒక బ్రేజ కారు అతివేగంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులను కొట్టేసి పారిపోతుండగా పట్టుకొని వెంటనే క్షతగాత్రులను దగ్గరుండి శంషాబాద్ ట్రిడెంట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేపించడం జరిగిందని


బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తెలిపారు. అతివేగంతో కారును నడిపి ప్రమాదానికి గురి చేసి పట్టించుకోకుండా పారిపోబోయిన బ్రేజ వాహనదారుణ్ని గట్టిగ మందలించి,క్షతగాత్రులు రాజేంద్రనగర్ వాసులుగా తెలుసుకొని వారి ఇంటి చుట్టుప్రక్కల పరిచయ వ్యక్తులకు సమాచారం అందించి,డాక్టర్లను క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తెలిపారు.

 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: