గడివేములలో చినుకు పడితే చాలు..... చిత్తడే చిత్తడి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలో సాయంత్రంనుండి ఉరుములు మెరుపులతో కురిసిన్న జోరు వానకు రహదారుల ప్రక్కల ఉన్న మురికి కాలువల నుంచి వర్షపు నీరుతో కలిసి మురుగునీరు చెత్త తో పొంగి పొరలిన నీటి నుంచి దుర్వాసన వెదజల్లుతుంది. గ్రామపంచాయతీ అధికారులు బీసీ కాలనీ మరియు పాత బస్టాండ్ కూడళి నందు మురికి కాలువలు చాలా రోజుల నుంచి శుభ్రం చేయక మురికి కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోవడం వలన దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే గ్రామపంచాయతీ సంబంధిత అధికారులే కరువయ్యారు. బీసీ కాలనీలోని కొన్ని ప్రధాన రహదారులలో వర్షపు నీరు వెళ్లడానికి కాలువలు లేకపోవడంతో రహదారులపై వర్షపు నీరు నిలబడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ప్రతి సంవత్సరము గ్రామపంచాయతీ కింద ప్రతి సంవత్సరం ఇంటి పన్ను, కులాయి పన్ను వసూలు చేస్తూ, షాపుకు 500 చొప్పున ప్రతి షాప్ నుండి వసూలు చేస్తున్న,
మురికి కాలువలు శుభ్రం చేయడంలో గ్రామపంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా గ్రామపంచాయతీ సంబంధిత అధికారులు స్పందించి రహదారుల పక్కన ఉన్న కాలువలను శుభ్రం చేయించి, కాలువలు లేని చోట కాలువలను నిర్మించి వర్షపు నీరు మరియు మురికినీటిని యధావిదంగా ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Home
Unlabelled
గడివేములలో చినుకు పడితే చాలు..... చిత్తడే చిత్తడి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: