రాజేంద్రనగర్ అసెంబ్లీలో...

కాషాయ జెండాను ఎగరవేదం

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ అసెంబ్లీలో కాషాయ జెండాను ఎగరవేద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పిలుపునిచ్చారు. మహావీర్ ఇంజనీర్ కళాశాలలో జరిగిన రాజేంద్రనగర్ అసెంబ్లీ సమావేశానికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, రాజకీయ, సామాజిక, ఎలక్టోరల్, సంస్థాగత, పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యక్రమాల అంశాలను ప్రస్తావించి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా పాతడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్, కో కన్వీనర్ మహాలింగం, బిజెపి సీనియర్ నాయకులు డా.ప్రేమ్ రాజ్, సిద్దిపేట బిజెపి ఇంచార్జి అంజన్ గౌడ్ , చేవెళ్ల పార్లిమెంట్ ఇంచార్జి మల్లారెడ్డి, డివిజన్ మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: