సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు

సామాజిక మార్పుకు నాంది పలుకుతున్నాయి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

సరూర్ నగర్, ఆర్కే పురం డివిజన్లలో మంజూరైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కు లను  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. సరూర్ నగర్  తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 56 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గములో ఇప్పటివరకు 5 వేళ మంది వరకు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ కింద లబ్ది చేకూరిందని,


రెండు డివిజన్ల పరిధిలో 1445 మందికి 11 కోట్ల 52 లక్షల పై చిలుకు నిధులు అందించినట్లు తెలిపారు.ఈ ఒక్క రోజే 56 మందికి చెక్కులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  గొప్ప ఆశయంతో ప్రారంభించిన కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాలు గొప్ప సామాజిక మార్పుకు కారణం అయ్యాయాని అన్నారు.అమ్మాయిలతో యూనివర్సిటీలు నిండిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్,, ఎగ్గే మల్లేశం, ఆర్డీవో, తహసీల్దార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: