అంగరంగ వైభవంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

 జననేతకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలివచ్చిన భారీ జనం

సబితా ఇంద్రారెడ్డికి సీఎం తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు

ఎటు చూసినా జనం.. ప్రియతమ నాయకురాలికి వందనం

మీ నమ్మకాన్ని కాపాడుకుంటా... మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు జరిగాయి. వేద పండితుల ఆశీర్వాదాలు, బిఆర్ఎస్ శ్రేణుల కోలాహలం మధ్యలో మంత్రి పుట్టిన రోజు సంబరాలు సాగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలు అభిమానులు రక్తదానం తో పాటు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జన నేత సవిత ఇంద్రారెడ్డికి జనన శుభాకాంక్షలు తెలుపటానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సవిత ఇంద్రారెడ్డికి సీఎం తో పాటు మంత్రులు ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు తెలిపారు. జనంలోకి వెళ్లి సేవ చేయండి అని గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నోటు పుస్తకాలతో మంత్రికి పార్టీ నేతలు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
నగరంలోని శ్రీనగర్ కాలనీతో పాటు,cమీర్ పేట్ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుండి,మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చి మంత్రికి  పార్టీ శ్రేణులు, మహిళలు, యువత, అధికార, అనధికార ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ..*

మీ అభిమానానికి ధన్యవాదాలు.... ప్రజాసేవలో మరింత బాధ్యతతో ముందుకెళ్తా....ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా.....ఊపిరి ఉన్నంత వరకు మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా...మహేశ్వరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా....నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా... అని వ్యాఖ్యానించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: