మోడల్ స్కూల్ విద్యార్థులకు...

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేయూత

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

టెక్సాస్ (అమెరికా) నగరంలో ఈ నెల 25వ తేది నుండి 28వ తేది వరకు నాలుగు రోజులు పాటు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫెరెన్సులో పాల్గొనడానికి వెళ్తున్న మహేశ్వరం మోడల్ స్కూల్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాసవి గ్రూప్ మేనేజ్మెంట్ ద్వారా సి ఎస్ ఆర్ ఫండ్స్ కింద Rs 6,11,000/-(ఆరు లక్షల పదకొండు వేల రూపాయలు) చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ శాస్త్ర సాంకేతిక రంగాలలో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

మహేశ్వరం మండలంలోని మారుమూల పల్లెల నుండి ప్రపంచంలోనే గొప్ప దేశమైన అమెరికాకు వెళ్తున్న  విద్యార్థులకు  అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న గొప్ప మనసున్న మానవతావాది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మరియు వారం రోజుల క్రితం గౌరవ మున్సిపల్&ఐటీ శాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లి విద్యార్థులకు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తున్న యువనాయకులు పి.కార్తిక్ రెడ్డికి  విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరి తరుపున మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: