భవన నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత
సిటీ ప్లానర్ ఎం.శ్యాంకుమార్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
భవన నిర్మాణ అనుమతుల మంజూరు అంతా పారదర్శకంగా సాగుతుందని జీహెచ్ఎంసీ సీటీ ప్లానర్ ఎం.శ్యాంకుమార్ వెల్లడించారు. ఇదిలావుంటే జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ సిటీ ప్లానర్ గా ఎం.శ్యాంకుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిటీప్లానర్ గా పనిచేస్తున్న శైలజ బదిలీపై వెల్లిపోవడంతో ఆమె స్థానంలో శ్యాంకుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో శ్యాంకుమార్, ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయం, ఎన్స్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చార్మినార్ జోన్ పరిధిలోని ప్రజలు భవన నిర్మాణ అనుమతులకోసం దళారులను నమ్మవద్దని సూచించారు. ఆ లైన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. నియమనిబంధనలు కలిగిన నిర్మాణాలకు పాదర్శకంగా అనుమతులు మంజూరవుతాయని ఆయన స్పష్టంచేశారు. తమ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని వాటిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చార్మినార్ జోన్ పరిధిలో చేపడుతున్న రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు భవనయజమానులు సహాకరించాలని ఆయన కోరారు.
Home
Unlabelled
భవన నిర్మాణ అనుమతుల మంజూరులో పారదర్శకత ,,, సిటీ ప్లానర్ ఎం.శ్యాంకుమార్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: