తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది
కేసీఆర్ త్యాగంవల్లే తెలంగాణ ఏర్పాటు
బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులు ప్రజలకు తెలియజేయండి
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి.తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని,
రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు,నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు.కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని,మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్, తాండూరు లో నర్సింగ్ కాలేజ్, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.
రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి. ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలి.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది,,,, కేసీఆర్ త్యాగంవల్లే తెలంగాణ ఏర్పాటు,,,, బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులు ప్రజలకు తెలియజేయండి,,,,రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: