గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు..

సీఎం కేసిఆర్ ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కందుకూరు మండలం నేదునూరు గ్రామ మోడల్ స్కూల్ గ్రౌండ్ లో  సీఎం కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిధిగా హాజరై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ.... సీఎం కప్ క్రీడోత్సవాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించి, గెలుపు ఓటములను సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ క్రీడాకారులను వెలికితీయాలనే లక్ష్యంతో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా సకల సౌకర్యాలు కల్పించి ప్రతి చోట క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని, ఆ దిశలో నేడు చాలా వరకు అందుబాటులో వచ్చాయన్నారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జయేందర్, సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్, సర్పంచ్ రామకృష్ణ రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా దేవేందర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రసిద్ద గడికోట మైదానంలో  చీఫ్ మినిస్టర్ కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంత్రి టాస్ వేసి క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.


ఇంకా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....పల్లె ప్రగతిలో భాగంగా అన్ని సౌకర్యాలతో పాటు ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. క్రీడా తెలంగాణగా రాష్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ చూపి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని మంత్రి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. క్రీడలంటే పాఠశాల,కళాశాల స్థాయిలోనే కాకుండా ఆయా గ్రామాల్లో ఉండే యువజన సంఘాలను కూడా క్రీడల్లో భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు.


వేసవిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోటీలు నిర్వహిస్తుంటారు. వారికోసమే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ తో ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానము ఉండేలా చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డేవలెప్మెంట్ కు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కంపెనీలు రాగా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.

అంతకుముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడాకారుల డ్రెస్ లను అందజేసారు. టాస్ వేసి వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ఎంపీపీ రఘుమా రెడ్డి గారు, వైస్ ఎంపీపీ సునీత ఆంధ్య నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్,సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: