తప్పిపోయిన మూడేళ్ల చిన్నారని చేరదీసి,,,
శిశువిహార్ కు తరలించి హుస్సేనీ ఆలం పోలీసులు
అమ్మాయికోసం పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సూచన
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తప్పిపోయిన మూడేళ్ల చిన్నారని చేరదీసి,,, యూసుఫ్ గూడలోనున్న ప్రభుత్వ శిశువిహార్ కేంద్రానికి హుస్సేనీ ఆలం పోలీసులు తరలించారు. వివరాలలోకి వెళ్లితే... హైద్రబాద్ పాతబస్తి హుసేనిఆలం పోలిసు స్టేషన్ పరిధిలో గత మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చార్మినార్ సమిపంలోని నిమ్రా హోటల్ వద్ద 3 సంవత్సరాల అమ్మాయి ఏడ్చుతు కనిపించింది.. విధుల్లొ భాగంగా అక్కడే ఉన్న హుస్సై ని ఆలం పొలిసులు అమ్మాయి తప్పిపొయిందని గ్రహించి అమ్మాయి యొక్క సమాచారము ప్రతి పొలిసు స్టేషన్ కు అందించారు. కానీ ఎవరు ఆ అమ్మాయి కోసం రాకపోవడంతో యూసుఫ్ గూడలోనున్న ప్రభుత్వ శిశు విహార్ కేంద్రానికి అమ్మాయిని తరలించారు. ఈ విషయాన్ని హుస్సేనీ ఆలం ఇన్ స్పెక్టర్ జి.నరేష్ కుమార్ తెలిపారు. ఈ అమ్మాయి ఆచూకి తెలిసిన వారు హుసేని ఆలం పొలిసు స్టేషన్ 040-27854793, ఇన్స్పెక్టర్ : 8712660335 కి సమాచారము అందించవలసిందిగా ఇన్స్ పెక్టర్ నరేష్ కుమార్ కోరారు.
Post A Comment:
0 comments: