మహాధర్నా విజయవంతం చేయండి

టి డబ్ల్యూ జే ఎఫ్ నేత పిల్లి రాం చందర్

హెచ్ యు జే ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్ల కార్డుల ప్రదర్శన

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా ను విజయవంతం చేయాలని టి డబ్ల్యు జే ఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పిల్లి రాం చందర్ పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ హెచ్ యు జే ఆధ్వర్యంలో జర్నలిస్టులు  మంగళవారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద ప్ల కార్డులు ప్రదర్శించారు. పిల్లి రాం చందర్ మాట్లాడుతూ..జర్నలిస్టు లందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సిఎం కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో ఎండ్లుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సిఎంను కోరారు.


జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫెడరేషన్ నిర్వహిస్తున్న మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గుడిగ రఘు, విజయానందరావు, హెచ్ యు జే నాయకులు రాజశేఖర్, సర్వేశ్, రమేష్ వీరేష్, లక్ష్మణ్, సాధత్ అలీ, ప్రవీణ్ కుమార్, కాలేబ్,వెంకట స్వామి, హన్స్ రాజ్, శివ ....పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: