దళారులను నమ్మోద్దు... ఆన్ లైన్లో దారఖాస్తు చేసుకోవచ్చు
జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇర్షాద్ మొహమ్మద్
అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇర్షాద్ మొహమ్మద్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా ఇర్షాద్ మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన రాణి కూకట్ పల్లికి బదిలీ కావడం తో కూకట్ పల్లిలో ఏసీపీగా పనిచేసిన ఇర్షాద్ మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇర్షాద్ మొహమ్మద్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, తాండూర్ మున్సిపాలిటీలతోపాటు హయత్ నగర్ జి హెచ్ ఎం సి కూకట్ పల్లి, జిహెచ్ ఎం సి కార్యాలయాలలో ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఈ సందర్భంగా ఇర్షాద్ మొహమ్మద్ మాట్లాడుతూ సర్కిల్ లైన్ పరిధిలోని హిమ్మత్ పురా, దూద్ బోలి రోడ్డు వైన్డింగ్ పనులను త్వరితగతి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన నిర్మాణదారుల భవన నిర్మాణ అనుమతుల కోసం సర్కిల్ ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో దళారుల నమ్మవద్దని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది
కేసీఆర్ త్యాగంవల్లే తెలంగాణ ఏర్పాటు
బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనులు ప్రజలకు తెలియజేయండి
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి.తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని,
రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారన్నారు. రాష్ట్రం ఏర్పాటు లాగే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, అదే విధంగా నూతన మండలాలు,నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత దగ్గరైందని అన్నారు.కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని,మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్, తాండూరు లో నర్సింగ్ కాలేజ్, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.
రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి. ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అందజేయాలి.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డిని కలిసిన వేరు కుల సంఘం నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో
తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు, పోల్కం శ్రీనివాస్, దీకొండ నర్సింగరావు, కె.లక్ష్మీనారాయణ, వొదల శేఖర్, అభినయ్, సూరజ్, నీరజ్, కె.రవిరాజ్, తదితరులు రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.
పనులను త్వరితంగా పూర్తి చేయండి
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, రెండు మునిసిపాలిటీలలో వెజ్,నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర లభించేలా సమీకృత మార్కెట్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన...
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
ఎంపీటీసీ కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. మహేశ్వరం మండలంలోని హర్షగూడ గ్రామ ఎంపీటీసీ ఎం. విజయ్ కుమార్ తండ్రి మేఘావత్ లక్ష్మణ్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం నాడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. వారి కుటుంభ సభ్యులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రామాలకు నిధుల వరద..
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులు విడుదల
కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కవిత ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో గ్రామపంచాయతీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సర్పంచ్లు, ప్రజలు, ఇతర ప్రజాప్రతినిధుల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధుల వరద
హర్షం వ్యక్తం చేస్తున్న మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీల ప్రజలు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ పట్టణ ప్రాంత రోడ్లకు మహర్దశపట్టింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలకు 43 కోట్ల 58 లక్షల 50 వేల నిధులు మంజూరు అయ్యాయి. దీంతో మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీ ప్రజలు హర్షంవ్యక్తంచేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు సైతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరను ప్రశంసిస్తున్నారు.
ఇదిలావుంటే మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు 62 పనులకు 17 కోట్ల 68 లక్షల యాభై వేలు,జల్ పల్లి మునిసిపాలిటీ లో 56 పనులకు 22 కోట్ల 40 లక్షలు,తుక్కుగూడ మునిసిపాలిటీలో 14 పనులకు 3 కోట్ల 50 లక్షల హెచ్ఎండీఏ నిధులు మంజూరయ్యాయి.
సీసీ, బీటీ రోడ్లతో పాటు పలు చోట్ల రోడ్ల వెడల్పు పనులు కూడా చేపట్టనున్నట్లు మొత్తం 132 పనులు 43.585 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నియోజకవర్గములో అన్ని ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కృష్జి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి కేటీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో
బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్.. బిజెపి నేతలు
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపొందుకుంటున్నాయి. ఈ రోజు సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవ మల్లేష్, బిజెపి పార్టీకి చెందిన గూడ సురేష్ , దండుగుల హరీష్ బీ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుండె రాములు, మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీను , గ్రామ యూత్ అధ్యక్షుడు తడకల వినోద్ , గ్రామ మహిళా అధ్యక్షురాలు అలివేలు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి.. షాది ముబారక్ చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు అందజేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో తుక్కుగూడ మునిసిపాలిటీ సర్దార్ నగర్ కు చెందిన లబ్దిదారులకు 58,59 జి ఓ ల కింద మంజూరు అయిన భూమి హక్కు పత్రాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణి చేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేదింటి అడబిడ్డల పెళ్ళిళ్ళకు ఈ పథకాలు వరం లాంటివి అన్నారు. దేశంలో ఎక్కడలేనివిధంగా తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద,మధ్యతరగతి ప్రజలకు 58,59 జి ఓ లతో ఆస్తి హక్కులు కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్దించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 వ తేదీ నుండి నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, సొసైటీ చైర్మన్ పాండు, సర్పంచ్లు, ఎంపీటీసీలు డైరెక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.
బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను
ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం మండలం ఉప్పు గడ్డ తండా గ్రౌండ్ లో 4 వ బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్రీడాకారులకు అల్ ద బెస్ట్ చెప్పారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, గెలుపు ఓటములు సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ , సర్పంచ్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.కో అపరేటివ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కో అపరేటివ్ భవనాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, సొసైటీ చైర్మన్ పాండు, డైరెక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.
సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని
సందర్శించిన చార్మినార్ రెసిపి భాస్కర్ రుద్ర
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని శుక్రవారం చార్మినార్ ఏసిపి భాస్కర్ రుధ్ర దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మెన్లు పోసాని సురేంధర్ ముదిరాజ్ ,బద్రీనాథ్ గౌడ్ ఏసిపి భాస్కర్ రుధ్రను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రామకృష్ణ పంతులు ప్రత్యేక అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, ప్రభు పూజా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి కన్నుమూత
సంతాపం ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ (92) మరణం పట్ల విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సంతాపం ప్రకటించారు. శుక్రవారం నాడు మంత్రి సబితా రెడ్డి గారు ఎమ్మెల్యే స్వగ్రామం ఎలిమినేడులో పద్మమ్మ గారి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొన్నారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రితో
పాటు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ, డీసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు సత్తు వెంకటరమణ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... దేశాన్ని రక్షిద్దాం
జిహెచ్ఎంసి సర్కిల్ 9 ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానగర పాలక సంస్థ సర్కిల్ 9 ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం దేశాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఆయాబస్తీలు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించే సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో
మహేశ్వరం నియోజకవర్గ మందిరాల అభివృద్ధికి... మరో 3 కోట్ల నిధులు మంజూరు...ఇప్పటికే 5 కోట్లు విడుదల
సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు,ప్రజలు
నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ అతి పురాతనమైన ఆలయాలకు మహర్దశ పట్టనుంది.ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని శివగంగా దేవాలయం, తుక్కుగూడ మునిసిపాలిటీ ఫాబ్ సిటీ శ్రీ వెంకటేశ్వర ఆలయం,ఆర్ కె పురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ దేవాలయానికి, బాలాపూర్ లో గల వేణుగోపాలస్వామి మందిరానికి జిల్లెల గూడ శ్రీ వెంకేశ్వర స్వామి గుడులకు కోటి రూపాయల చొప్పున మంజూరు అయిన విషయం తెలిసిందే.ఆయా దేవాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు,భక్తుల సౌకర్యాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. తాజాగా మహేశ్వరం మండలం జిన్నాయిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయానికి కోటి రూపాయలు, గట్ పల్లి శ్రీ వీరంజనేయ స్వామి మందిరానికి కోటి రూపాయలు, ఉప్పగడ్డ తండా శ్రీ సేవాలాల్ మహరాజ్ గుడికి కోటి రూపాయల చొప్పున నిధుల విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా యాదాద్రి టెంపుల్ ను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.నియోజకవర్గంలోని అతి పురాతనమైన దేవాలయాల అభివృద్ధికి కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నియోజకవర్గంలోని 8 ప్రాచీన దేవాలయాల్లో కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన,ఇతర పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.