ఇఫ్తార్ విందులతో మతసామరస్యం చాటుతున్న,,,ముస్లిం సోదరులు

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జల్ పల్లిలోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

పవిత్ర రంజాన్  మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాసలు ఉండి ఇఫ్తార్ విందులు నిర్వహిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారని అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్ పల్లిలో ఆదివారం జల్ పల్లి మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.  షేక్ జహంగీర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం ఉపవాస దీక్షల విరమణలో పాల్గొని,వారికి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు తెలిసి మహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో మంచి పనులు చేయటం ఎంతో గొప్ప విషయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణా రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నారని,దసరా సందర్భంగా చీరల పంపిణీ, క్రిస్మస్ సందర్భంగా కానుకలు,రంజాన్ కు తోఫా అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు సయ్యద్ యూసఫ్ పటేల్,  కౌన్సిలర్ మజర్ అలీ, సావుద్, కె. లక్ష్మీనారాయణ, జల్పల్లి మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, వర్కింగ్ ప్రెసిడెంట్. యంజాల  జనార్ధన్, మున్సిపల్ ఉపాధ్యక్షులు దూడల  శ్రీనివాస్ గౌడ్, కార్మిక విభాగ అధ్యక్షులు.  దామోదర్ రెడ్డి, మున్సిపల్ మైనార్టీ అధ్యక్షులు షేక్ అఫ్జల్ , ఉపాధ్యక్షులు ఎండి .సాదిక్, బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత,  ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్, 16వ వార్డు అధ్యక్షులు  పోలేమోని నాగేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు  దూడల సుధాకర్ గౌడ్, సూరెడ్డి సత్తి రెడ్డి, బర్కత్ అలీ, కొంగర సుభాష్, అనుష్ గౌడ్, మన్నన్ భాయ్ ,మైనార్టీ యూత్ నాయకులు హుస్సేన్, ఇంద్రిస్, సామ్ ఖాన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: