నంద్యాల మెడికల్ కళాశాల,హాస్పిటల్ నిర్మాణ పనులు అడ్డుకొనేందుకు,,,
టీడీపీ నేతల విఫలయత్నం...సుప్రీంకోర్టులో చుక్కెదురు....
నంద్యాల శాసనసభ సభ్యులు శిల్పరవిచంద్ర కిషోర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానికనంద్యాల పట్టణంలోని ప్రజల చిరకాల కోరికను ఎవ్వరూ అడ్డుకోలేరని,నంద్యాల శాసనసభ్యులు శిల్పారవిచంద్రకిషోర్రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నంద్యాలకు మెడికల్ కళాశాల, హాస్పెటల్ నిర్మాణం కోసం 475 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా స్థానిక ఆర్ఎఆర్ఎస్ కే ఆర్ చెందిన స్థలాన్ని కళాశాల, హాస్పెటల్ నిర్మాణానికి ప్రతిపాధన చేసిన నేపథ్యంలో కేటాయించిన ప్రాంతంలో మెడికల్ కళాశాల,హాస్పెటల్ నిర్మాణం చేపట్టకూడదంటూ ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ధర్మాసనం వారి కేసును కొట్టివేస్తూ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,వచ్చే విద్యాసంవత్సరంలో మెడికల్ అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని ఎన్ఎంసీ వారు అనుమతులు ఇవ్వగా నిర్మాణం పనులు వేగవంతంగా నూతన సాంకేతిక విధానంలో నిర్మాణాలు జరుగుతుండంతో టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో
సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం,నంద్యాల ప్రజల విజయమని, న్యాయమే గెలిచిందని, ఇందుకు కృషిచేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి, అధికారులకు, న్యాయవాదులకు నంద్యాల ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని,నంద్యాల ప్రజలకు శుభవార్త వెల్లడించడానికి ఎంతో సంతోషంగా ఉందని,
నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు మెడికల్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలించి,వచ్చే విద్యాసంవత్సరంలో 150 మెడికల్ అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చన్న శుభవార్తలను తెలియజేయడం సంతోషంగా ఉందని, అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రతిపక్ష నేతలకు హితవుపలికారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి,ఆప్కో డైరెక్టర్ సుబ్బారాయుడు,కౌన్సిలర్ చంద్రశేఖర్,రమణ, సాయిరాంరెడ్డి,రితీష్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
నంద్యాల మెడికల్ కళాశాల,హాస్పిటల్ నిర్మాణ పనులు అడ్డుకొనేందుకు,,, టీడీపీ నేతల విఫలయత్నం...సుప్రీంకోర్టులో చుక్కెదురు.... నంద్యాల శాసనసభ సభ్యులు శిల్పరవిచంద్ర కిషోర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: