ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ను...
ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జిల్లెలగూడ చందన చెరువు దగ్గర 20 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పర్యాటక స్థలంగా చందనం చెరువు......వాకింగ్ ట్రాక్,తో పాటు చిన్న పెద్ద ఉదయం సాయంత్రం సేద దీరాటానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్.వ్యాయామంతో మానసిక ప్రశాంతత.... ఆరోగ్యం.........ఓపెన్ జిమ్ తో ప్రయోజనం.....ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వ కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మినీ ట్యాంక్ బండ్ లాగా చందనం చెరువు కట్ట.....వరుసగా మహనీయుల విగ్రహాలు....ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు లావణ్య , కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ను... ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: