మహానంది సన్నిధిలో....
బీహార్ డిఐజి క్రాంతి దంపతులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది సన్నిధిలో బీహార్ క్యాడర్ డిఐజి క్రాంతి దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి దర్శనానికి విచ్చేసిన క్రాంతి దంపతులకు ఆలయఅధికారులు నీరకంఠం రాజు ఆలయ మర్యాదలతో డిఐజి క్రాంతి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం క్రాంతి దంపతులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అధికారులు శ్యాలువతో సత్కరించి స్వామి వారి జ్ఞాపికను మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా డిఐజి క్రాంతి దంపతులు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Home
Unlabelled
మహానంది సన్నిధిలో.... బీహార్ డిఐజి క్రాంతి దంపతులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: