రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని గద్దెదించాలి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని మిడ్తూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార బేరి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ ఓబులేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు సిపిఎం నాయకులు భాస్కర్ రెడ్డి,వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారం లోనికి రావడానికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని,రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని,ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగ నియామకాలు చేపడతామని, పేద ప్రజలకు నిత్యవసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతామని,
రైతుల పండించిన పంటను స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు చేసి రైతులకు రెట్టింపు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడుదారులకు అనుకూలంగా మారుస్తుందని,పెట్రోలు, డీజిల్,వంట గ్యాస్, విద్యుత్ చార్జీలు పెంచడం జీఎస్టీ పేరుతో విపరీతంగా పేద ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ప్రజలను బిజెపి దోపిడీ చేస్తుందని, మిడుతూరు మండలానికి హంద్రినీవా ద్వారా సాగు, తాగునీరు అందించాలని, అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిపోయి 2 సంవత్సరాలవుతున్న ఇంతవరకు నిర్మాణ చర్యలు చేపట్టకపోవడం విచారకరమని, మిడుతూరు మండలంలోని సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన చేపడతామని వారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానికులు సుజ్ఞానం,జయరాముడు,చంద్రశేఖర్ రెడ్డి,సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు,వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.
Home
Unlabelled
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని గద్దెదించాలి.... సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: