ముస్లిం సోదరులకు...
ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు.,,,తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగోె వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ముస్లిం సోదర సోదరీమణులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి, శనివారం నాడు ఈదుల్ ఫిథర్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న ముస్లింలందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో కఠోర ఉపవాస దీక్షలు ఉండి, ఫిత్రా,జాకాత్ లతో పేదలకు సహాయం చేయటం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.ఇస్లాం సమాజానికి అహింస, శాంతి,ప్రేమ,దయ,కరుణ,సౌభ్రాతృత్వాన్ని బోధిస్తుందని అన్నారు.రంజాన్ ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా లు అందిస్తూ అండగా ఉన్నారన్నారు.రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Home
Unlabelled
ముస్లిం సోదరులకు..... ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు.,,,తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: