నిజమైనా లబ్దిదారులకు ఇళ్ళా పట్టాలు మంజూరు చేయాలి

రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రాయలసీమ రవీంద్ర నాథ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ మండల పరిధిలోని స్థానిక ఓర్వకల్లు మండల తహసీల్దార్ శివ ప్రసాద్ రెడ్డికి రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రాయలసీమ రవీంద్రనాథ్, ఏఐవైఎల్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా  రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్విఎఫ్) రాయలసీమ రవీంద్ర నాథ్,ఎఐవైఎల్ జిల్లా అధ్యక్షుడు రాజు,విక్రమ్ లు మాట్లాడుతూ ఓర్వకల్ మండలంలోని ఈ వివిధ  గ్రామాలలో జగనన్న కాలనీలలో ఇంతవరకు లేఔట్లు వేయలేదని,తక్షణమే కొమరోలు,వెంకటాపురం గ్రామాలలో లేఔట్లు వేసి లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని, మొదటి విడతలో ఇళ్ల పట్టాలు మంజూరు అయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంటే కొన్ని గ్రామాలలో మాత్రం పట్టాలు వచ్చినా, మీ ఇంట్లో ఇద్దరికి,ముగ్గురుకి మంజూరయ్యాయని,


మీ ఇంట్లో అంతమందికి ఎలా వస్తాయనే, వివిధకారణాలు చెబుతూ లబ్దిదారుల పట్టాలు ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే అటువంటి వారిని గుర్తించి విచారణ చేసి నిజమైన లబ్ధిదారులు ఉంటే విచారించి తక్షణమే వారికి ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయాలని,  గ్రామాల్లో కుల,మత భేదాలు లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా రెండవ విడతలో  నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని ఓర్వకల్లు మండల ఎమ్మార్వో శివప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం స్పందించిన ఓర్వకల్లు ఎమ్మార్వో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిజమైనా లబ్దిదారులు ఎవరైనా సరే  జగనన్న ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఏఫ్,ఏఐవైఏల్  విద్యార్థి సంఘం నాయకులు విష్ణు,రాజు, బాలకృష్ణ నాయక్ మరియు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: