నీరు తాగండి వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
గడివేముల మండలం వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు మండలంలో అత్యధికంగా ఎండతీవ్రత 42 డిగ్రీలు దాటుతున్నందున గడివేముల మండలంలోని ప్రజలు,ద్విచక్ర వాహనాలపై,బస్సులలో ప్రయాణం చేసేవారు అత్యధికంగా నీటిని, మజ్జిగ,టెంకాయనీరు సేవించి వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని,గడివేముల మండలంలో అత్యధికంగా వ్యవసాయకూలీలు పొలాలకు వెళ్తున్నారని, వ్యవసాయకూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు మంచినీటిలో పోషక పదార్థాలైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను కలిపిన ద్రావణాన్ని సేవించడం వల్ల వడదెబ్బ బారినపడకుండా ఉంటారని,ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల
మధ్యాహ్నం 12:00 గంటలలోపు ఇంటికి చేరుకొని ఉపశమనం పొందాలని,పొలాలలో పనిచేసేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో కళ్ళు తిరగడం, చెమటలు ఎక్కువ వచ్చిన వెంటనే తమదగ్గరలో ఉన్న సహచర్లకు సమాచారం అందించాలని,అలాంటి వారికి ప్రధమ చికిత్స నిమిత్తం మంచినీరు తాగించి,తడిబట్టతో తుడిచిన ఆనంతరం ప్రాథమిక కేంద్రం వద్దకు తీసుకురావాలని, చిన్నపిల్లలు ఉదయం 11:00 గంటల నుండి సాయంకాలం 04:00 గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో ఆడుకోకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గడివేముల మండల ప్రాథమిక వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని తెలిపారు.
Home
Unlabelled
నీరు తాగండి వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి... గడివేముల మండలం వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: