ట్యాక్స్ ల విషయంలో అపోహలు వద్దు
నాటి టాక్స్ లే చెల్లించవచ్చు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,కార్పొరేటర్లు, కమిషనర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుండి మునిసిపల్ గా మారినపుడు ఉన్న టాక్స్ లే వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అపోహలకు తావులేకుండా పాత టాక్స్ నే చెల్లించాలన్నారు.ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు.
Home
Unlabelled
ట్యాక్స్ ల విషయంలో అపోహలు వద్దు ,,, నాటి టాక్స్ లే చెల్లించవచ్చు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: