బూజునూరు గ్రామంలో జరిగిన భారీ చోరీపై కేసు నమోదు చేసిన...
గడివేముల ఎస్ఐ బిటీ. వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బూజునురు గ్రామానికి చెందిన ద్వారం జనార్ధన రెడ్డి(35)రాత్రి 09.00 గంటలకు కుటుంబ సమేతంగా భోజనం చేసి ఇంటికి తాళం వేసి పైన ఉన్న మేడ మీద పడుకొని తెల్లవారుజామున 04.00 గంటలకు వచ్చి చూడగా ఇంటి కిటికీ చువ్వలు తీసి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి బెడ్ రూం తాళం పగలగొట్టి బెడ్రూమ్ లోవున్న బీరువా ను రాడుతో తొలగించి బీరువా తలుపులు తెరిచి బీరువాలో వున్న సుమారు 20 తులాలబంగారు, సుమారు 20 తులాల వెండినగలు గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించుకొని వెళ్ళారని పిర్యాదు చేయగా పాణ్యం సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో
గడివేముల ఎస్సైబిటి.వెంకటసుబ్బయ్య దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.
Home
Unlabelled
బూజునూరు గ్రామంలో జరిగిన భారీ చోరీపై కేసు నమోదు చేసిన... గడివేముల ఎస్ఐ బిటీ. వెంకటసుబ్బయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: