హనుమాన్ జయంతిని పురస్కరించుకొని...
అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర
వేలాదిగా పాల్గొన్న భక్తులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ఓల్డ్ సిటీలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కన్నుల పండుగగా వైభవముగా హనుమాన్ శోభా యాత్ర సాగింది. సుమారు ఐదు వేల మంది యువత ఈ శోభా యాత్రలో ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. లాల్ దర్వాజా, గౌలిపురా , శాలిబండ , తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వైభవముగా శోభా యాత్ర సాగింది,
శోభా యాత్రలో బీజేపీ ఓ బి సి మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అలే భాస్కర్, మాజీ కార్పొరేట్ అలే జితేందర్ ఆధ్వర్యములో ఈ శోభాయాత్ర జరిగింది. ఈ సందర్భంగా అలె బాస్కర్, కార్పొరేటర్ అలె భగ్యలక్ష్మి , మాజీ కార్పొరేటర్ అలె జితేంధర్ లను సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయ చైర్మన్ లు పోసాని సురేందర్ ముదిరాజ్, చైర్మన్ సి శివ కుమార్ యాదవ్ సన్మానించారు.
అమ్మవారి ప్రతి రూపంతో గల మెమెంటో అందచేశారు . ఈ కార్య క్రమంలో కాశి నాథ్ గౌడ్ మాజీ చైర్మన్ , పోసాని సదానంద్ , తిరుపతి నాగరాజ్, శేఖర్ ,నర్సింహగౌ, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర సందర్భంగా సౌత్ జోన్ డి పి పి సాయి చైతన్య ఆధ్వర్యములో ఏ సి పి షేక్ జహంగీర్ , ఛత్రినాక సి ఐ భోజ్య నాయక్ శాలిబండ సి ఐ కిషన్ చక్కటి భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
Home
Unlabelled
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని... అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర ,,,, వేలాదిగా పాల్గొన్న భక్తులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: