కుల వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు...

మహాత్మ జ్యోతిరావు పూలే

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

కుల వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలె అని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కొనియాడారు. నిత్యం బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకై,  అణగారిన వర్గాల అభ్యున్నతికి పరితపించిన యోధుడు  మహాత్మా జ్యోతిరావు పూలె అని ఆయన పేర్కొన్నారు.  రాజేంద్రనగర్ నియోజకవర్గం.*  రాజేంద్రనగర్ నియోజకవర్గ, రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన "మహాత్మా జ్యోతిరావు పూలె 197వ జయంతి" ఉత్సవాల్లో పాల్గొని ఆ మహనీయునికి పులా మాల వేసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘన నివాళులర్పించారు.


ఈ సందర్భంగా కూలి చేపట్టిన సంఘసంస్కరణలను ఆయన ప్రస్తావించారు. మనదేశంలో బీసీలు, అట్టడుగు వర్గాలు రాజకీయంగా ఉన్నత స్థానం సాధించారంటే మహాత్మ జ్యోతిరావు పూలే వేసిన బాటలే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రాజకీయాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: